Murali Sharma: 'ఓదెల-2' చిత్రం లెజెండరీ మురళి ఫస్ట్ లుక్.. 10 d ago

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా నటిస్తున్న 'ఓదెల-2' చిత్రం సంపత్ నంది కథా రచయితగా అశోక్ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. 'ఓదెల-2' చిత్రం ఏప్రిల్ 17న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. రంజాన్ పండుగ సందర్భంగా మూవీ మేకర్స్ అదిరిపోయే పోస్టర్ ను షేర్ చేశారు. లెజెండరీ యాక్టర్ మురళి శర్మ 'ఓదెల-2' సినామాలో నటిస్తున్నట్లు తెలుపుతూ ఫస్ట్ లుక్ ను నెట్టింట పెట్టారు. ఈ చిత్రంలో ఆయన 'అల్లా బక్షు' పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించారు.